నా రెండవ కథ - పై దారి


పైదారి
- అరుణ్ కుమార్ ఆలూరి
నాదో అందమైన చిన్న ఇల్లు. ఇంటి వెనక రైలు పట్టాలు, ఇంటి ముందర తారు రోడ్డు, మధ్యలో ఇల్లు. నూట పది గజాల స్థలంలో ఒక్క అంగుళం కూడా వదిలి పెట్టకుండా కట్టుకున్న అందమైన ఇల్లు. ఈ పట్టణంలో నాలాంటి మధ్యతరగతి జీవికి ఇంటికి ముందు కొంత, ఇంటి వెనక కొంత స్థలం వదిలి అక్కడ మొక్కలు పెంచుకోవాలని, వాటి దినదినాభివృద్ధి చూస్తూ తన్మయత్వం చెందాలని ఆశపడితే అది అత్యాశే అవుతుంది. అందుకే పట్టాల గట్టున పెరిగే మొక్కలే నా చిట్టి మొక్కలని ఊహించుకుంటూ ఉంటాను. ఊహ ఎంత అందమైనది! ఊహలోనే జీవితం ఉంది. నిజానికి సగటు మనిషి ఆనందంగా బ్రతికేది ఊహా జీవితంలోనే కదా!

ఇంటి ముందర భాగంలో షెట్టర్ కట్టించాను. దాని గుండా లోపలికి వస్తే వరండా, తర్వాత బెడ్‌రూం, చివరగా వంట గది. దాని వెనకాల రైలు పట్టాలు. షెట్టర్‌లో కిరాణా షాపు పెట్టాను. నేను ఆఫీసుకి బయలుదేరేంత వరకు షాప్‌ని చూసుకుని, ఆ తర్వాత నా భార్యకు అప్పజెప్పేవాణ్ణి. సాయంత్రం రాగానే మళ్ళీ నేనే కూర్చునే వాణ్ణి.

***

ఇంటి పక్కన నర్సమ్మ, ఆమె భర్త ఉండేవారు. కాని నర్సమ్మే అందరికి ఎక్కువగా తెలుసు. వాళ్ళకీ ఇంటి ముందర భాగంలో షెట్టర్ ఉంది. దాంట్లో చాయ్ దుకాణం పెట్టింది. కొన్ని రోజులకు ఉదయం పూట ఐడ్లీలు, సాయంత్రం పూట మిరపకాయ బజజీలు వేయడం మొదలు పెట్టింది. ఆమె చేసిన బజ్జీలు ఎత రుచో, ఆమె మాటలు అంత ఘాటు. లేవగానే గొడవ పెట్టుకనేది. గొడవ పెట్టుకోవడనికి ఆమెకి చిన్న కారణం చాలు. ఒక వేళ ఏరోజైనా కారణం దొరక్కపోతే అంతకు ముందు రజు గొడవనే మళ్లీ సాగదీసేది. ఒక్కోరోజు ఒక్కొక్కరతో గొడవ. చివరికి ఆమెకది అలవాటుగా మారిపోయింది. ఆె "సుప్రభాతం"తోనే ఉదయం నిద్రలేవడం అలవాటయింది. ివరికి ఆమెను ఎవరూ పట్టించుకోని పరిస్థితి వచ్చంది. ఇంటి వెనక రైలు శబ్దాలు, ముందర వాహనాల శబ్దాల, పక్కన నర్సమ్మ అరుపులు ... నిత్య జీవితంలో భాగమైపయాయి.

జీవితం హాయిగా సాగిపోతూ ఉంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నగరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. నా కిరాణా కొట్టులో కూడా మార్పులు వచ్చాయి. పరిస్థితులకు తగ్గట్టు మారాలి. లేకపోతే జీవితం లేదు కదా! పిల్లలు డిగ్రీ కొచ్చారు! కొత్తగా పైదారులు(ఫ్లై ఓవర్లు) కట్టనున్నట్టు దిన పత్రికలో చదివి ఆశ్చర్యపోయాను. అదేంటో అర్థం కాక అమ్మాయినడిగాను. "నది దాటడనికి వంతెన ఎలాగో, ట్రాఫిక్ జాంని తప్పించడనికి పైదారి అలాగ" అని చెప్పింది. చాలా ముచ్చటేసింది. నా ఇంటికి కిలో మీటరు దూరంలో ఉన్న ఆర్.టి.సి. చౌరస్తాలో కూడా ఒక పైదారి వస్తే బాగుండుననుకున్నాను.  రోజూ అక్కడ అరగంట గడిపితే గాని ఆకుపచ్చ సిగ్నల్ కనిపించడం లేదు. రాను పోను, గంట సమయం అక్కడే ఆవిరైపోతూ ఉంటుంది. 

ఎప్పటిలాగే ఆ ఉదయం లేవగానే నర్సమ్మ "సుప్రభాతం" వినిపించలేదు. అందుకే ఆలస్యంగా లేచానేమో అనిపించింది. బ్రష్ చేస్తూ బయటకొచ్చి చూస్తే ఆశ్చర్యం! నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. నర్సమ్మ ఛాయ్ దుకాణంలో  వేరే ఎవరో వచ్చి టిఫిన్ సెంటర్ పెట్టారు. ఇడ్లీలతో పాటు దోశలు, వడలు, పూరీలు కూడా కనిపిస్తున్నాయి.


నా ఆశ్చర్యాన్ని గమనించిన అర్థాంగి, నీళ్ల బిందెతో అలాగే నిలబడి వివరణ ఇచ్చింది. "ఇల్లు అద్దెకు ఇచ్చేసి రాత్రికి రాత్రే భర్తతో కలిసి నర్సమ్మ ఎక్కడికో వెళ్లిపోయింద"ని చెప్పింది. పాపం నర్సమ్మ! ఆమె పరిస్థితి తలచుకుంటే జాలేసింది. కాలానుగుణంగా ఆమె మారలేకపోయింది.

ఇడ్లీలు, మిరపకాయ బజ్జీలు తప్ప వేరేవి వేసేది కాదు. ఆ దుకాణానికి కూత వేటు దూరంలో మరో టిఫిన్ సెంటర్ వెలిసింది. అక్కడ అన్ని రకాల అల్పాహారాలు ఏర్పాటు చేశారు. ఇడ్లీలు మాత్రమే తినేవారు ఎంత మంది ఉంటారు? గిరాకీ పడిపోయింది. ఒక్కోరోజు పది రూపాయలకు మించి అమ్ముడు పోయేవి కావు. నర్సమ్మకి, కోడలికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. ఆ సమయంలో నర్సమ్మ కొడుకు భార్యతో సహా మరో ఊరికి మకాం మార్చాడు. అప్పులు చేసి బ్రెడ్ తయారు చేసే పని మొదలు పెట్టాడు. అతను తయారు చేసే నాణ్యమైన బ్రెడ్‌కు తిరుగు లేకుండా పోయింది. అప్పులు తీర్చేశాడు. సొంతంగా ఆటోలు కొని వాటితోనే బ్రెడ్ సప్లయ్ చేయసాగాడు. నర్సమ్మ ఇంట్లోకి కలర్ టీవీ వచ్చింది. మరెన్నో కొత్త వస్తువులు తరలి వచ్చాయి. ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది ఒక్క దుకాణం తప్ప. ఛాయ్, ఇడ్లీ, బజ్జీలను మాత్రం నర్సమ్మ వదలలేదు. అలవాటైన ప్రాణం ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఆ దుకాణాన్ని అలాగే నడిపించేది.

నర్సమ్మ కొడుకు అప్పుడప్పుడూ ఒక్కడే వచ్చి చూసి వెళ్తుండేవాడు. సంఘంలో పేరు కోసం అనవసరపు ఖర్చులు చేయడం మొదలు పెట్టాడు ఆమె కొడుకు. ఆ పనుల్లో పడి డబ్బు వసూళ్లను డ్రైవర్లకు అప్పజెప్పాడు. కొన్నాళ్లకు ఆటో డ్రైవర్లు, పనివాళ్లు కుమ్మక్కై, వసూళ్లు పంచుకొని ఉడాయించారు. వ్యాపారం కుప్పకూలింది. ఆదాయానికి మించిన ఖర్చులతో అప్పటికే అప్పులపాలయ్యాడు. పరిస్థితి చేదాటిపోయింది. వేరే దారిలేక ఆటోలు అమ్మి అప్పులు తీర్చేశాడు. సంగతి తెలిసి లబోదిబోమంటూ ఏడ్చింది నర్సమ్మ. కొన్నాళ్లకు నర్సమ్మ కొడుకు ఇంటికి రావడం మానేశాడు. ఒక్కసారిగా ఆకాశానికెక్కిన నర్సమ్మ జీవితం పాతాళానికి జారింది. అందుకే ఆమె వెళ్లిపోయింది.  ఎక్కడికెళ్లిందో ఆమెకే తెలియాలి!

***

వయసు పెరుగుతున్న కొద్దీ ముసలితనం రాకపోగా, రోజురోజుకీ యవ్వనం పెరుగుతున్నట్లు అనిపిస్తోంది ఈ నగరానికి. పాత భవంతుల స్థానంలో కొత్త అద్దాల షాపింగ్ మాల్‌లు వెలిశాయి. మాదాపూర్ కాస్తా హైటెక్ సిటీ అయింది. పార్క్‌లు, పబ్‌లు, మల్టీప్లెక్స్‌లు, కొత్త కంపెనీలు, ఉద్యోగాల కోసం వచ్చే యువకులు, చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు.... వారితో పాటే ట్రాఫిక్ అన్నీ పెరిగిపోయాయి. ఇంటి ముందర ఖరీదైన కార్లు, వెనక ఎం.ఎం.టి.ఎస్. రైళ్లు పరుగెత్తుతున్నాయి. పట్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. వాటి జంట భలే గమ్మత్తుగా ఉంటుంది. కలిసి ఉంటాయి. కాని ఎప్పటికీ కలవ లేవు.

కొన్నేళ్ల తర్వాత నర్సమ్మ వచ్చింది. ఇన్నాళ్లుగా ఇంటికి వచ్చిన అద్దె, వేరే ఊళ్లో ఆమె సంపాదన మొత్తానికి ఆర్థికంగా స్థిరత్వం సంపాదించింది. కొడుకుతో మళ్లీ అదే బ్రెడ్ తయారీ మొదలు పెట్టించింది. కాని ఆ దుకాణాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అదే చాయ్, అదే బజ్జీ, అదే "సుప్రభాతం".

***

హాయిగా సాగిపోతున్న జీవితంలో మరో శుభవార్త తెలిసింది. మరిన్ని ఫ్లైఓవర్లు కట్టనున్నట్టు పత్రికలో చదివి ఆనందపడ్డాను. ఎక్కడెక్కడ కట్టనున్నారో అని ఆత్రంగా వెతుకుతున్న నా కళ్ల నుండి నీళ్లు జలజల రాలాయి. గుండెల్లో కలుక్కుమంది. నా ఇంటి ముందున్న రోడ్డుపై ఫ్లైఓవర్ వస్తుందట. తార్నాకకి వెళ్లే వాహనాలు ఇక మీదట ఈ పైదారి గుండా వెళ్తాయట. క్యాంపస్ గుండా వెళ్లడం మానేస్తాయట. దీని నిర్మాణమే గనక జరిగితే నా కిరాణా కొట్టు గిరాకీ కచ్చితంగా దెబ్బతింటుంది. ాదేమిటీ, నర్సమ్మ చాయ్ దుకాణం, ఆ పక్కనే శీనుగాడి ూలకొట్టు, ఎదురుగుండా ఉన్న నేతి మిఠాయిల గిరాకీ న్నీ దెబ్బతింటాయి. ఆ వార్త తెలిసిన క్షణం నుంచి తుకు భారమైపోయింది.

***

కొన్న రోజులకి ఆర్ & బి వాళ్లు వచ్చి కొలతలు చూసి రోడ్ుకిరువైపులా ఉన్న ఇళ్ల ముందర భాగాల్ని కూలగొట్టల్సొస్తుందని చెప్పారు. నా కాళ్ల కింద భూమి కంపించినట్లైంది. పస్తులుండి, ఒక్కో రూపాయి కూడబెట్టి కట్టుకున్న నా అందమైన ఇల్లు మట్టిలో కలిసిపోతుంది. నర్సమ్మ ఆవేశం కట్టలు తెంచుకుంది. నోటికొచ్చినట్లు తిట్టింది. శాపనార్థాలు పెట్టింది.

"ఆర్.టి.సి. చౌరస్తాలో ట్రాఫిక్‌లో చిక్కుకుని రోజు ఎంతో మంది ఆఫీసులకు ఆలస్యంగా వెళ్తున్నారు. ఎంతో మంది విద్యార్థులు కాలేజీలకు లేటుగా వెళ్తున్నారు. అక్కడ కట్టడం మానేసి ఇక్కడ కట్టి ఏం సాధిస్తారు? ఇక్కడంత ట్రాఫిక్ లేదే, ఇక్కడ కడితే ఎంత మందికి ఉపయోగం?" అన్నాను ఆవేశంగా.

"ఆడ కట్టరయ్యా! ఆడ కడితే ఓటళ్లు, టాకీసుల గిరాకీలేం గావాల? ఆడయితే ఎట్ల కడ్తరని అడిగెటోళ్లు శానా మంది పెద్దోల్లు ఉన్నరయ్యా! మన పేదోళ్ల మాటలు ఓళ్లింటరయ్యా! అయినా ట్రాఫిక్ జాంని తగ్గియ్యాలంటే బ్రిడ్జిలు కడితే సరిపోతదా? ఇక్కడికచ్చే మనుసుల్ని తగ్గియ్యాలగని! ఇక్కడ ఇన్ని వందల కంపిన్లున్నయ్. పెద్ద పెద్ద కంపిన్లని ఏం జెయ్యలేరు. ఆఖిరికి శిన్న శిన్న కంపిన్లన్నింటిని అన్ని జిల్లాలకు పంపించి అక్కడే పెట్టుకోండ్రి అంటే  అయిపోతది కదా! ఎక్కడోళ్లు అక్కడే పంజేసుకుంటరు. ఇక్కడిదాక ఎందుకస్తరు?

గీ పట్నమొక్కటే డెవలప్ జేసుడు గాదు, అన్ని టౌన్‌లని డెవలప్ జెయ్యాల. అయితెనే ట్రాఫిక్ సమస్య తీర్తది. అంతేకాని బ్రిడ్జీల్ కడితే తీర్తదా? ఊరంత బ్రిడ్జిలు కట్టినా ఈ ట్రాఫిక్ ఇట్లనే ఉంటది. ఈల్ల నోట్లె మన్నువడ. ఈల్లు బాగువడరు. మన ఉసురు తగిలి సర్వనాశ్నమైపోతరు." అంటూ గుండెలు అవిసేలా ఏడుస్తూ తన బాధని వెళ్లగక్కింది. నిజంగా నర్సమ్మది ఎంత గొప్ప ఆలోచన.

కాని ఎవరు మాత్రం ఏం చేయగలరు? మరికొన్ని రోజులకు "రోడ్ క్లోజ్‌డ్" అని బోర్డ్ పెట్టేసి, సికింద్రాబాద్ వెళ్లే వాహనాలన్ని రాం నగర్ గుండా, అడిక్‌మెట్ మీదుగా దారి మళ్లించారు.

ప్రొక్లెయిన్లు, పోలీసులతో రంగంలోకి దిగారు అధికారులు. అన్ని ఇళ్ల ముందరి భాగాలని కూలగొడుతున్నారు. నా దుకాణం మట్టిలో కలిసిపోబోతుంది. అది తలచుకోగానే గుండె బరువెక్కిపోయింది. చివరిసారి తనివితీరా చూసుకున్నాను. ప్రొక్లెయిన్లు నా ఇంటివైపే వస్తున్నాయి, బతికున్న మనిషిని తినేందుకు వస్తున్న రాబందుల్లా! చూస్తుండగానే రెండే రెండు దెబ్బలతో నేలకొరిగింది. ఎం.ఎం.టి.ఎస్. రైలు శబ్దంలో కలిసిపోయింది దాని అరుపు. తలలేని మొండెంలా మిగిలిపోయి మూగగా రోదిస్తోంది. ఆ ప్రాంతమంతా శోకసంద్రమైపోయింది. అందమైన ఇల్లు అదృశ్యమైపోయింది.

అది గడిచి నాలుగు సంవత్సరాలైంది. కాని ఇప్పటికీ ఆ పైదారి పూర్తి కాలేదు. చౌరస్తాలో పైదారి మంజూరు కాలేదు. ట్రాఫిక్ జాం మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది హనుమంతుని తోకలా..!

*** అయిపోయింది ***
డిసెంబర్ 9, 2007న ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో ప్రచురితం.

19 కామెంట్‌లు:

  1. mechukotaniki naaku words takkuvavuthunnayi.sooooooooooooooo
    just fabulous.naaku nee katha chadivaka im feeling proud that u r from our college.

    రిప్లయితొలగించండి
  2. hi arun nee kadalu chaduvuthunnanu......... 2nd story supeb

    రిప్లయితొలగించండి
  3. nee stories chaduvudam ante ikkada images kanapadadam levu ra..Am very happy for you ra...
    This is naveen from CSIT, VREC

    రిప్లయితొలగించండి
  4. arun garu mee kathalu chala bagunnayi. inka evaina rasara?

    రిప్లయితొలగించండి
  5. దినేష్12/24/2010

    అభివృధ్ధి అనేది అన్ని ప్రాంతాల్లోనూ జరిగితేనే బాగుంటుంది. లేకపోతే తక్కెడలో ఒక వైపే బరువున్నట్టుగా మారుతుంది జీవన స్థితిగతి. ఆ సంగతి ఈ పాలకులు ఎప్పుదు గ్రహిస్తారో!

    ఆలూరి గారు, చక్కటి కథను అందించారు. వీలైనంతగా రాస్తూ ఉండండి. మాలాంటివాళ్లకు మీ రచనలతో కాస్త హాయినివ్వండి.

    -దినేష్

    రిప్లయితొలగించండి
  6. గీ పట్నమొక్కటే డెవలప్ జేసుడు గాదు, అన్ని టౌన్‌లని డెవలప్ జెయ్యాల. అయితెనే ట్రాఫిక్ సమస్య తీర్తది. అంతేకాని బ్రిడ్జీల్ కడితే తీర్తదా? ఊరంత బ్రిడ్జిలు కట్టినా ఈ ట్రాఫిక్ ఇట్లనే ఉంటది. ఈల్ల నోట్లె మన్నువడ. ఈల్లు బాగువడరు. మన ఉసురు తగిలి సర్వనాశ్నమైపోతరు."
    చాలా బాగుంది సార్.. సమస్యను విశ్లేషించిన తీరు ఆలోచనాత్మకంగా వుంది.. కంగ్రాట్స్...

    రిప్లయితొలగించండి
  7. KHadir Story..."khadar ledu" anukunta, gurthukochindi...globalisation effect lo rasina katha....mee katha bagundi..వయసు పెరుగుతున్న కొద్దీ ముసలితనం రాకపోగా, రోజురోజుకీ యవ్వనం పెరుగుతున్నట్లు అనిపిస్తోంది ఈ నగరానికి.Super Line..

    రిప్లయితొలగించండి
  8. పై దారి fly over పదానికి అనువాదం , కథ నడిపిన తీరు బావున్నాయి శుభం జయం సదా
    సర్వదా

    రిప్లయితొలగించండి
  9. మీ కధ బావుందండీ... అలా మొదలుపెట్టి పూర్తిచెయ్యకుండా సంవత్సరాల తరబడి ఆపెయ్యడం అనేది నేను ఒక్క భారతదేశంలోనే చూసాను. పేదవాని బ్రతుకులపైన దాష్టికం చెయ్యడం అంటే ఏంటో మీ కధలో చెప్పారు. బావుంది.

    రిప్లయితొలగించండి
  10. కథ చాలా బావున్నదండి.

    రిప్లయితొలగించండి
  11. hi arun... meeru kadhani kallaku katti chupincharu.. chala stright words and normal ga vrasaru... chala bagundi.. keep rocking..

    రిప్లయితొలగించండి
  12. Sujatha12/08/2013

    Chala Chala Bagundandi mee katha.. Abhivrudhi oke daggara kendrikrutamaite paristitulu daarunanga maarataayani 2007 lone chepparu.. ippudu mana rashtram lo paristiti alage undi.. ippatikaina paalakulu maraalani ashiddam..

    రిప్లయితొలగించండి
  13. నిజంగానే అభివృద్ధి జరగాల్సిన చోటు కాక మరెక్కడో జరుగుతుంది.అభివృద్ది పేరుతో ఈ లోపు చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి.చక్కటి కథాంశాన్ని తీసుకున్నారు.

    రిప్లయితొలగించండి