నా గురించి

నమస్తే..
    

నా పేరు అరుణ్ కుమార్ ఆలూరి! చలన చిత్ర దర్శకున్ని అవ్వాలన్నది నా అభిలాష. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉన్న దారుల్లో సాహిత్యాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నాను. ఇప్పటివరకు వివిధ పత్రికల్లో 19 కథలు, 15 నానీలు ప్రచురితమయ్యాయి. రాసింది తక్కువ.. రాయాల్సింది ఎక్కువ.. అందుకు సమయాభావం కూడా ఒక కారణం.

ప్రతిష్ఠాత్మకమైన American Telugu Association-ఆట వారు తమ దశమ ఆట మహాసభల (10th ATA Conference and Youth Convention) సందర్భంగా నిర్వహించిన పోటీలో నా నాలుగవ రచన అయిన మేడిపండు కథ ద్వితియ బహుమతి గెలుచుకుంది.

కణిక (సాహిత్యం సామాజిక సేవ విద్యారంగ వేదిక), 2020 - జనవరిలో "దిశ - దుర్దశ" అంశంపై నిర్వహించిన కథల పోటీలో నా ఎనిమిదవ రచన అయిన పొదుగు కథ ద్వితియ స్థానం సంపాదించుకుంది.

వాసా ఫౌండేషన్ మరియు సాహితీ కిరణం మాస పత్రిక 2020 - సెప్టెంబర్ లో  "ప్రస్తుత స్త్రీ సమస్యలు - పరిష్కారాలు" అన్న అంశం మీద సంయుక్తంగా నిర్వహించిన డా|| వాసా ప్రభావతి స్మారక కథలపోటీలో, నా కథ రక్షణ కి ప్రత్యేక బహుమతి లభించింది. 

కెనడా డే సందర్భంగా తెలుగుతల్లి కెనడా మాస పత్రిక  2021 - మేలో నిర్వహించిన కథలపోటీలో చిన్ని మనసులు కథ బహుమతి గెలుచుకుంది. మొత్తం వచ్చిన 120 కథల్లోంచి, 30 కథలను ఎంచుకొని, అన్నింటికి సమాన బహుమతి ప్రకటించారు.

విశాలాక్షి సాహిత్య మాసపత్రిక 2021 జులైలో నిర్వహించిన, శ్రీ ఆళ్ల దశరథరామిరెడ్డి స్మారక కథల పోటీలో సుబ్బయ్యతాత పెళ్లి కథ బహుమతి గెలుచుకుంది. 20 బహుమతి కథలతో ప్రత్యేకంగా పుస్తకాన్ని ప్రచురించే ఆనవాయితీని గత 12 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.

నవ సాహితీ ఇంటర్నేషనల్ వారి ముళ్ళపూడి ఉత్తమ హాస్య కథ పురస్కారాన్ని (2021 - ఆగష్టు) కుడిఎడమైతే..! కథకు అందుకున్నాను. 

నమస్తే తెలంగాణ దిన పత్రిక - ముల్కనూరు ప్రజాగ్రంథాలయం నిర్వహించిన కథల పోటీలో తండ్లాట కథ ప్రత్యేక బహుమతిని గెలుచుకుంది.

మేడిపండు (ఆటా), మిణుకుమనే ఆశలు (తెలుగు వెలుగు), సుబ్బయ్యతాత పెళ్లి (విశాలాక్షి), సూపర్ ఫాస్ట్ రైటర్ (సారంగ), తండ్లాట (నమస్తే తెలంగాణ) కథలతో పాటు, కొత్తకథ 2022 సంకలనంలో ప్రచురితమైన ఒడ్డున ఉన్నోడు కథ చక్కని గుర్తింపును తెచ్చిపెట్టాయి. పై వాటితో పాటు నవ్య, ప్రజాశక్తి, ఆంధ్రభూమి, సంచిక, సహరి పత్రికల్లో, అలాగే కొత్తకథ 2022, యువ - కథా సంకలనాల్లో కూడా నా కథలు చోటు సంపాదించాయి.

నా సాహిత్యం, రచన – దర్శకత్వంలో “సూపర్ డూపర్ స్టార్” లఘు చిత్రాన్ని రూపొందించాను. 

సినిమాల వైపు ఇప్పుడిప్పుడే మెల్లిగా అడుగులు పడుతున్నయి. "జయమ్మ పంచాయితీ" సినిమాకు స్క్రిప్ట్ డాక్టర్‌గా,  "8 ఏ.యం. మెట్రో" (హిందీ) సినిమాకు స్క్రిప్ట్ కన్సల్‌టంట్‌గా, "షరతులు వర్తిస్తాయి!" సినిమాకు కో-రైటర్‌గా పని చేశాను.


ధన్యవాదాలు!

- అరుణ్ కుమార్ ఆలూరి


email: arunkumaraloori at gmail dot com
facebookhttps://www.facebook.com/aloori
instagramhttps://www.instagram.com/arun.kumar.aluri/
phone: six three zero five eight one six two four two