పత్రికలో ప్రచురింపబడిన నా మొట్టమొదటి కార్టూన్
My First Published Cartoon in Print Media
అక్టోబర్ 8, 2014లో నా మొదటి కార్టూన్‌ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినప్పుడు అనూహ్య స్పందన లభించింది. 178 షేర్లు, 600 పైచిలుకు లైకులతో చాలా ప్రోత్సాహకరంగా అనిపించింది. ఆ తర్వాత నా కార్టూన్ల కోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్‌లో పేజ్ క్రియేట్ చేశాను కానీ వ్యక్తిగత కారణాల వల్ల మరియు సమయం అనుకూలించక ఎక్కువగా కార్టూన్లు వేయలేకపోయాను.
ఈ మధ్యే మళ్లీ మొదలుపెట్టి ఫిబ్రవరిలో ఒక కార్టూన్ గీసి ఈ పేజ్‌లోనే పోస్ట్ చేస్తే మళ్లీ 480 పైచిలుకు లైకులతో స్పందన లభించడం సంతోషాన్నిచ్చింది. ఆ తర్వాత అనూహ్యంగా వచ్చిన కరోనా మరియు లాక్‌డౌన్‌లతో ప్రపంచంతో పాటూ నేనూ స్తంభించిపోయాను.
పరిస్థితులు సాధారణమవుతున్నట్టుగా అనిపించాక, మళ్ళీ కార్టూన్ వైపు మనసు మల్లి ఈ కార్టూన్ గీసి వార్త దినపత్రికకు పంపిస్తే, యాదృచ్చికంగా మొదటి కార్టూన్ వేసి ఆరేళ్లు పూర్తైన ఈ అక్టోబర్ నెలలోనే పదవ తారీఖునాటి వార్త దినపత్రిక యొక్క ఆదివారం అనుబంధంలో అది అచ్చయి మరింత సంతోషాన్ని కలిగించింది.
ఈ సంతోషానికి కారణాభూతులైన అందరికి ధన్యవాదాలు..!!
కార్టూన్ లింక్ (కంప్యూటర్‌లో చూడటానికి): https://epaper.vaartha.com/2855493/Sunday-Magazine/11-10-2020/#page/21/1
కార్టూన్ లింక్ (మొబైల్‌ఫోన్‌లో చూడటానికి): https://epaper.vaartha.com/m5/2855493/Sunday-Magazine/11-10-2020#issue/21/1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి