పాతాళ్ లోక్ (హిందీ) వెబ్ సీరీస్ - అనుమానం లేకుండా చాలా బాగుంది అని చెప్పొచ్చు.. నిరభ్యంతరంగా చూడొచ్చు కూడా..! నా సమస్యంతా నిడివి గురించి మాత్రమే.. ఒక్కో ఎపిసోడ్ దాదాపు 40 నిమిషాలు.. అలా 9 ఎపిసోడ్స్.. అంటే 6 గంటలు.. కాస్త గట్టిగా కూర్చుంటే ఇందులోంచి కనీసం ఒక పావు భాగానికి పైగానే తీసేయ్యొచ్చు, దాని వల్ల కథకు వచ్చే నష్టం ఏమీ ఉండదు..! ఉదాహరణకు హీరో కొడుకు పాత్ర తాలూకు కథ.. అది ఇదివరకే ఇదే అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన "ది ఫ్యామిలీ మ్యాన్" వెబ్ సిరీస్ లో హీరో కొడుకు కథలాగే ఉంటుంది.. అందులో కొడుకు చిన్నపిల్లాడు, వీడు కాస్త పెద్దవాడు.. వయసు మార్పు దృష్ట్యా కొన్ని ఊహించగలిగే సన్నివేశాలు ఉంటాయి, అవి మినహాయిస్తే ఆసాంతం ఇది చూస్తున్నప్పుడల్లా అదే గుర్తొస్తుంది..! అలాగే హీరో బావమరిది తాలూకు కథ.. అది కూడా తీసెయ్యొచ్చు..! వాటితో పాటు ఇంకొన్ని సన్నివేశాలు ఉన్నాయి, కేవలం సాగతీయడానికే పెట్టినట్టు అనిపిస్తుంది..!
వెబ్ సిరీస్ కి ఉన్న అడ్వాంటేజ్ ని ఉపయోగించుకొని స్క్రీన్ ప్లే రాసుకున్నారు.. బాగున్నప్పటికీ కొంచెం కన్ఫ్యూషన్ కి గురిచేస్తుంది. కొన్ని శృతి మించిన సన్నివేశాలు - హద్దుల్లో పెట్టి తీసినా బాగానే ఉండేది కదా అనిపిస్తుంది..!
కులాలు, మతాల పేర్లని ఉన్నదున్నట్టుగా వాడుకోవడం ధైర్యం, తెగింపు అనుకోవచ్చు.. ఇక్కడే వాళ్ళు ఘన విజయం సాధించారు అని చెప్పవచ్చు.. మనిషిలోని రాక్షసత్వాన్ని ఉన్నదునట్టుగా చూపించారు.. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు మనం ఇదివరకే విన్న, చదివిన కథనాలు గుర్తుకువచ్చి మనం ఎటువంటి సమాజంలో బ్రతుకుతున్నామో అని మరోసారి గుర్తుచేసి ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది.. అఫ్ కోర్స్ ఈ కరోనా వచ్చి చిన్న గీత పక్కన పెద్ద గీత గీసింది.. చూసే దృక్పథంలో ఇప్పుడు మార్పు ఉండవచ్చు.. ఈ కరోనా క్రైసిస్ తరువాతనైనా మనుషులందరూ సమానమనే దిశగా వెళతారా లేక మరిన్ని అసమానతలవైపు పయనిస్తారా అన్నది అతిపెద్ద ప్రశ్న..!!
కథ, దర్శకత్వం, ఛాయాగ్రహణం, కళ, సంగీతం, నటన - ఇవి అద్భుతంగా ఉన్నాయి..!
ఇవన్నీ పక్కన పెడితే, 6 గంటలు వెచ్చించే సహనం మీకుంటే, క్రైం థ్రిల్లర్ లు ఎంజాయ్ చేసే వాళ్లైతే తప్పకుండా చూడండి..!
అమెజాన్ ప్రైమ్ లో ఉంది..!!
నిజమే నిడివి ఇంకా కొంచం తగ్గిస్తే బాగుండేది. అయితే హీరో అంత తెగించి పోరాడటానికి, తన కొడుకు, భావమరిదే కారణం. కొడుకు,తన తండ్రిని ఎప్పుడు చులకనగా, ఏమిసాధించని వానిగా చూడడం, బావమరిది చెప్పకుండా మొత్తము తన బిజినెస్ సామానుతో వచ్చినప్పుడు, భార్య తన మాటకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా అతన్ని ఆహ్వానించడం కూడా తనను ఇంట్లో అందరు అసమర్తునిగా భావిస్తున్నారు అనే భావన కలిగి, తప్పకుండా కేసును సాల్వ్ చెయ్యాలనే పట్టుదలతో హీరో చేసిన ప్రయత్నం కథను నడిపిస్తుంది. అందువల్ల నా ఉద్దేశంలో కొడుకు, బావమరిది పాత్ర కథకు ప్రాధాన్యము.
రిప్లయితొలగించండిఅయితే మాస్టర్జిని కనుగొనే ప్రయత్నం సాగదీయడం మరియు కొద్దిగా అయోమయంగా ఉంది. ఈ ఎపిసోడను కాస్త తగ్గించి కన్ఫ్యూజన్ లేకుండా చుపెడితే బాగుండేది.
ఒకవిషయం మాత్రం స్పష్టం. ఇక ముందు మన ఫిల్మ్ మేకర్స్ అందరు ప్రేక్షకులను సినిమా హాల్స్ కు రప్పించడానికి చాలా కృషి చేయాల్సి వుంటుంది. Corona పుణ్యమా అని ప్రజలు OTT channels వల్ల సినిమా అంటే ఏమిటో భాగా నేర్చుకున్నారు. Be careful film makers, if you want to be in business, you have to be more creative.
ఇది Season 1 మాత్రమే, హీరో కొడుకు పాత్ర ఎందుకు పెట్టారు అనేది next season లో తెలుసుంది, కధ అయిపోలేదు, ఇంకా ఇద్దరి కధుంది అందులో ఒకడి పగుంది వాడి transformation ఉంది జరిగిన అన్యాయం ఉంది, Sanjeev mehra after life undi, అతడి office girlfriend ఉంది, కొత్తగా media businessలో దిగినవాడి కధుంది, కొత్త intern కి background ఉంది, Sanjeev boss ని threaten చేసినందుకు Tit for tat ఉంది, basic గా చెప్పాలంటే ఇంకా చాలా matter ఉంది, So అప్పుడే దీన్ని Judge చెయ్యలేం, చూసినంతవరకూ బాగుంది, ఏకబిగిన అన్ని చూసేసా
రిప్లయితొలగించండిఫేస్బుక్లో ఈ సమీక్షని పోస్ట్ చేసినప్పుడు కామెంట్ రూపంలో కొమ్మిడి విశ్వేందర్ రెడ్డి గారి అభిప్రాయం, మిర్చి మహేష్ గారి అభిప్రాయం తెలియజేశారు. వీళ్లిద్దరి అభిప్రాయాలు సబబుగానే అనిపించాయి. వాటి వల్ల చూసే దృక్కోణం మారుతుందని వాటిని కూడా పోస్ట్ చేశాను.
రిప్లయితొలగించండి