ఇట్స్ నెగెటివ్..!!
అంటే కరోనా లక్షణాలతో అనుమానం వచ్చి టెస్ట్ కి వెళితే నెగెటివ్ వచ్చిందని నా ఉద్దేశం కాదు,
ఏప్రిల్ 6న పాజిటివ్ వస్తే, 17 రోజుల హోం ఐసొలేషన్ తర్వాత నెగిటివ్ వచ్చింది అని చెబుతున్నాను! (మొదటి వేవ్ లో 14 రోజుల హోం ఐసొలేషన్ ఉండేది, ఇప్పుడు అది 17 రోజులకు మారింది)
నాకు కరోనా వచ్చిందని తెలిసిన వెంటనే, నాతో పాటే ఉన్న మా ఆవిడ, మా బాబుకి కూడా చేయించాను. వాళ్ళకి నెగెటివ్ వచ్చింది. అంతకు 5 రోజుల ముందు వరకు నాతో దగ్గరగా ఉన్న వారందరికీ ఈ విషయం చెప్పాను. వాళ్ళలో 2 ఏళ్ల బాబు ఉండటం కాస్త టెన్షన్ పెట్టింది. అదృష్టం కొద్దీ, బాబుతో సహా అందరికీ నెగెటివ్ వచ్చింది. చాలా రిలీఫ్ గా అనిపించింది.
నాకు పాజిటివ్ అని తెలిశాక, ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది వారు 5 రోజులకు మందులు ఇచ్చారు. వాటిని ఏ పూటకు ఆ పూట క్రమం తప్పకుండా వేసుకున్నాను. ఈ 5 రోజులు వాడాల్సిన మందుల్లో, ప్రతిరోజు 3 పూటలా వేసుకునే టాబ్లెట్ పారాసెటమాల్ 500mg మాత్రమే!
వాటితో పాటు రోజుకు 3, 4 సార్లు పసుపు వేసిన నీటితో ఆవిరి పట్టుకున్నాను. అందులో పసుపు తప్ప వేరే ఏ మందులూ వేయకూడదు అని, ఆరోగ్య సిబ్బంది (కాల్ సెంటర్ నుంచి) ఫోన్ చేసి చెప్పారు. ఆయుష్ సూచించిన మసాలాతో ఒకపూట టీ తాగాను. సూచనల మేరకు మూడు పూటలు అప్పుడే వండిన వేడి వేడి ఆహారం తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్మిస్, డేట్స్, పల్లిపట్టి), పండ్లు (అరటి, ఖర్బూజ, సపోటా), జ్వరం తగ్గిపోయిన తర్వాత (నాకు 1 రోజులోనే తగ్గింది) రోజుకి రెండు ఉడకబెట్టిన గుడ్లు తీసుకున్నాను. పాలలో కొంచెం పసుపు వేసుకొని తాగాను. నీళ్ళు ఎప్పుడూ కాస్త వేడివే తాగాను. జ్వరం తగ్గాక నాన్-వెజ్ కూడా తినమని చెప్పారు. ఈ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు అన్న విషయం పక్కన పెడితే, ఎంత సాలిడ్ గా తీసుకుంటున్నారు అన్నదే ముఖ్యం అని గుర్తుంచుకోవాలి.
ఈ 17 రోజులు నేను వాడిన అన్ని వస్తువులను నేనే శుభ్రం చేసుకున్నాను, వేరే ఎవరినీ ముట్టనివ్వలేదు.
5 వ తేదీ రాత్రి భోంచేసిన గంట, గంటన్నర తర్వాత జ్వరం వచ్చింది, సాధారణ జ్వరంలా కాకుండా తక్కువ సమయంలో ఒళ్ళు వేడెక్కిపోయింది. ఇంట్లో ఉన్న డోలో 650 వేసుకొని, అనుమానం వచ్చి హాల్లో ఒక్కడినే పడుకున్నాను. మరునాడు ఉదయం టెస్ట్ కి వెళితే, పాజిటివ్ వచ్చిందని చెప్పగానే, ఒక్క క్షణం కళ్లు తిరిగినట్టు అనిపించింది. కోవిడ్ గురించి కాస్తో కూస్తో తెలిసిన నేను కూడా కంగారుపడటం ఏంటి అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను.
మొదటిరోజు జ్వరంగా అనిపించింది. రెండో రోజు అది తగ్గి ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. రోజంతా శారీరక శ్రమ చేస్తే రాత్రికి వచ్చే నొప్పులు, ఏ శ్రమా చేయకుండా రోజంతా ఆ నొప్పులు ఉండటం అన్నమాట! అవి ఒక మూడు రోజులు ఉన్నాక, మరో మూడు రోజులకు నెమ్మదిగా తగ్గిపోయాయి. 3 వ రోజు నించి వాసన, రుచి కోల్పోయాను. కోవిడ్ అనుభవం ఉన్న మిత్రుని సలహా మేరకు డేటాల్ / సావ్లాన్ వాసన చూడటం మొదలు పెడితే, మొదటి రోజు 50%, రెండో రోజు 80%, మూడో రోజు 100% దాని వాసన కోల్పోయాను, నీళ్లు ఎలా వాసన రావో అలా అనిపించింది, అయినప్పటికీ ఇతర సువాసనలు (వండిన కూరలు, టీ వగైరా) కొన్ని 20% నుంచి 50% మధ్యలో వచ్చేవి. డేటాల్ / సావ్లాన్ వాసన తెలియడానికి పదిరోజుల పైనే పట్టింది. రుచి పూర్తిగా 100% తెలియటానికి 20 రోజులు పట్టింది. జలుబు & దగ్గు అటు ఉన్నట్టూ కాదు, ఇటు లేనట్టూ కాదు అన్నట్టుగా ఉండేవి.
నా దగ్గర ఆక్సీమీటర్ లేకపోవడం వల్ల, శ్వాసను ఆపి 20 సెకండ్లు ఉండగలనో, లేదో అని చెక్ చేసుకున్నా! మొదటి సారి 16 సెకండ్ల వరకే ఆపగలిగాను. పెద్దగా ఖంగారు పడలేదు. (చిన్నప్పుడు ఏదో సీరియల్ లో క్రూర్ సింగ్ అనే పాత్ర అనుకుంటా ఊపిరి ఆపుకోవడం చూసి, సరదాగా కొన్ని రోజులపాటు అలా ప్రాక్టీస్ చేసి 1 నిముషం వరకు ఆపిన సందర్భాలు గుర్తొచ్చి, ప్రాక్టీస్ లేకపోవడం వల్ల అలా అయ్యుంటుంది అనుకున్నాను) దాంతో ఆ రోజు అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తే, మరుసటి రోజు 25, 30 సెకండ్ల వరకు ఆపుకోగలిగాను. అంతకు మించి ఆపుకునే సందర్భం ఇప్పుడు కాదని, అక్కడితో ఆపేసి, మూడు పూటలా అలా చెక్ చేసుకున్నాను. నాకైతే శ్వాసలో ఇబ్బంది తలెత్తలేదు.
ఇది వరకే శ్వాస సంబంధిత సమస్యలు (నిమోనియా మొ||), లేదా ఇతర సమస్యలు ఉన్న వారికి కరోనా సోకితే చాలా జాగ్రత్తగా ఉండాలి. కంగారుపడటం, భయపడటం కాకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం మంచిది!
ఈ క్వారంటైన్ సమయంలో ఎటువంటి శారీరక శ్రమ చేయకూడదు అని, పూర్తి విశ్రాంతి తీసుకోవాలి అని, ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. మొదటి వేవ్ లో వాళ్ళ అన్నకి కరోనా రావడంతో, అతను ఆరోగ్యంగానే ఉన్నాను అని భావించి నీళ్లతో ఉన్న బకెట్ ని ఎత్తి తీసుకువెళ్ళటంతో శ్వాస అడటంలో చాలా ఇబ్బంది వచ్చి, సీరియస్ అయి ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని, 4-5 లక్షల ఖర్చు, వారం రోజుల టెన్షన్ తర్వాత తగ్గి ఇంటికి వచ్చాడని చెప్పాడు. సినిమాలు చూడటం, పుస్తకాలు చదవటం వంటివి కూడా చేయకూడదని మరో మిత్రుడు సలహా ఇచ్చాడు. దాంతో నేను విశ్రాంతిలోనే ఉన్నాను.
బిపి షుగర్ తో బాధపడుతున్న 50 ఏళ్ల మరో తెలిసిన వ్యక్తి కరోనా సోకి, హోం ఐసొలేషన్ లో ఉంటూ, ఆక్సీమీటర్ లో 92, 91 లెవల్ ఆక్సిజన్ చూయించినపుడు, పచ్చ కర్పూరం ఒక గుడ్డలో పెట్టుకొని పీల్చడం, అనులోమ్ విలోమ్, కపాలి బాత్, భత్రిక వంటి ప్రణయమాలు చేయడం వల్ల 98 లెవల్ కి వచ్చిందని చెప్పారు. రోజులో ఒక మూడు సార్లు తగ్గేదని, ఇలా ప్రణాయామాలు చేసినప్పుడు పెరిగి, 4, 5 గంటలు అలాగే ఉండేదని, తగ్గినప్పుడు మళ్లీ చేసేవాడిని అని చెప్పారు. వారికి కూడా నిన్న నెగెటివ్ వచ్చిందని తెలిసింది.
అన్నిటికన్నా సంతోషకరమైన విషయం, 95 ఏళ్ల మా తాతయ్యకు ఏప్రిల్ రెండో వారంలో కరోనా సోకితే, ఐసోలేషన్ వార్డులో చేర్పించి మామయ్యలు దగ్గరుండి చూసుకోవడం, 5 రోజుల్లో నెగెటివ్ రావడంతో డిశ్చార్జి చేయడం, ఆ తర్వాత ఇంట్లో మెల్లి మెల్లిగా ఆయన ఆరోగ్యం మెరుగవుతూ పూర్వ స్థితికి రావడం గొప్ప ఊరట!
ఇప్పటికీ అర్థం కానీ, అంతుచిక్కని విషయం ఏమిటంటే, నేను ఊరికి వెళ్లి వచ్చే వరకు N95 మాస్క్ ధరించే ఉన్నాను. నీళ్ళు తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు మినహా ఎప్పుడూ మాస్క్ తీయలేదు, అయినా కరోనా రావడం, ఆ సమయంలో నాకు దగ్గరగా ఉన్న మా వాళ్లెవరికీ రాకపోవడం, ఆనందం ఆశ్చర్యం!
ఈ సెకండ్ వేవ్ లో కరోనా ఎక్కడి నుంచి ఎలా వస్తుందో? ఇతరులకి ఎలా స్ప్రెడ్ అవుతుందో? అర్థం కావడం లేదు.
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి. ఒక వేళ వెళ్ళవలసి వస్తే N95 మాస్క్ ఉపయోగించండి. అది లేకపోతే, లేయర్స్ తో ఉన్న క్లాత్ మాస్క్ (బయట వైపు) + సర్జికల్ మాస్క్ (దాని లోపల) ఇలా ఈ రెండూ కలిపి వాడటం మంచిది. బయట ఇతర వ్యక్తులతో కచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ దూరంగా ఉండండి. కొత్త వస్తువులు తాకినా, అనుమానం వచ్చినా ముందు చేతులు సానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి.
ఒకవేళ కరోనా వస్తే, హోం ఐసొలేషన్ లో ఉంటూ 95% మంది చాలా సునాయాసంగా కరోనా నుంచి కోలుకుంటున్నారన్న విషయం మర్చిపోవద్దు!!

thank you for posting a positive experience amid this massive crisis. much appreciated.
రిప్లయితొలగించండిThank You 💐
తొలగించండిమీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు నమస్కారాలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలండి 💐
తొలగించండి>>>సినిమాలు చూడటం, పుస్తకాలు చదవటం వంటివి కూడా చేయకూడదని మరో మిత్రుడు సలహా ఇచ్చాడు.>>
రిప్లయితొలగించండిసమయం ఎలా గడిపారు ?
మొదటి 5 రోజులు, తిన్న తరువాత కాసేపు వజ్రాసనం వేసి పడుకోవడం మాత్రమే చేశాను. 6 వ రోజు నుంచి 15 నిముషాలు అలారం పెట్టుకొని, ఉదయం & సాయంత్రం ఫోన్ (fb, వాట్సప్, సినిమా), సిస్టమ్ (సినిమా) తో గడిపాను. అలారం మోగగానే వాటిని పక్కన పెట్టేసి మళ్లీ పడుకునేవాడిని.
తొలగించండి