శ్యామ్ బెనెగల్ నిష్క్రమణ
Local is Global అని 50 సంవత్సరాల క్రితం నమ్మి Ankur (1974) సినిమాతో ప్రయాణాన్ని మొదలుపెట్టి, దాంతో పాటు Nishant (1975)లోనూ తెలంగాణ కథా స్థలంగా తీసుకొని ఇక్కడి సంస్కృతిని, పండుగలు అందంగా చూపెట్టారు శ్యామ్ బెనెగల్. ఈ సినిమాలు హిందీలో ఉన్నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే సామాన్య ప్రజలు తెలంగాణ మాండలికంలోనే మాట్లాడుకుంటారు.
ఇవి కాకుండా Welcome To Sajjanpur (2008), Well Done Abba (2010) - అనే రెండు సినిమాలు సరళమైన హాస్యంతో ఉండటం వల్ల నాకు బాగా నచ్చాయి. Well Done Abba కథా స్థలం హైదరాబాద్ పక్కన ఊరు. శ్యామ్ బెనెగల్ గారి సినిమాల్లో బాగా నాకు నచ్చేది నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక & వారి నుంచి రాబట్టుకునే అత్యున్నత పనితనం. ఆయన ఫోటోలు ఎన్ని చూసినా, 'ఏ పని చేసినా చిత్తశుద్ధితో చెయ్' అని చూపులతోనే చెబుతున్నట్టుగా అనిపిస్తుంది.
పద్దెనిమిది జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఒక ఫిలింఫేర్ అవార్డు, ఒక నంది అవార్డు, భారతీయ సినిమా రంగంలో అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ, మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును వెంట తీసుకొని 23 డిసెంబర్, 2024న లోకం విడిచి వెళ్ళారు.
💔💐🙏😞
#ShyamBenegal
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మహానుభావుడు 🙏.
రిప్లయితొలగించండివారి ఆత్మకు సద్గతి ప్రాప్తించాలవి కోరుకుంటున్నాను 🙏.
70s 80s లో శ్యాం బెనెగల్ వంటి వారు పారలెల్ సినిమా అనబడే సామాజిక, వాస్తవిక దృష్టితో సినిమాలు తీశారు. ఆ సినిమాలు ధియేటర్లలో వచ్చేవి కావు. ఫిల్మ్ ఫెస్టివల్స్ లో లేదా దూర్ దర్శన్ లోనో వేసేవారు. సామాన్య ప్రజలుకి అలాంటి సినిమాలు వచ్చినట్టు కూడా తెలియదు.
రిప్లయితొలగించండిశ్యాం బెనెగల్, సత్యజిత్ రే, మృణాల్ సేన్ బాహుబలి, కెజీ ఎఫ్, పుష్ప సినిమాలు స్వర్గంలో చూసి హాపీ ఫీల్ అవుతారు.