Sleepless Night (2011) {French: Nuit Blanche} సినిమా పరిచయం



కథ: పోలీస్ డిపార్టుమెంటు లో డిటెక్టివ్ గా పనిచేసే వ్యక్తి(Tomer Sisley), అతని సహోద్యోగి(Laurent Stocker )తో కలిసి కొకయిన్ తీసుకెళ్తున్న రాయబారుల మీద దాడి చేసి ఆ డ్రగ్స్ ని దొంగతనం చేసి దాచిపెడతారు. ఆ క్రమంలో అతనికి చిన్న గాయం కూడా అవుతుంది. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టు ఆఫీస్ కి వెళ్తారు. అయితే ఆ డ్రగ్స్ తాలూకు డీలర్(Serge Riaboukine) & నైట్ క్లబ్ యజమాని కి అది వీళ్ళ పనే అని తెలిసి, అతని కొడుకు(Samy Seghir )ని తన కిడ్నాప్ చేసి తన నైట్ క్లబ్ లో దాచిపెట్టి, అతనికి ఫోన్ చేసి ఆ డ్రగ్స్ తిరిగి ఇవ్వమని బెదిరిస్తాడు. కాని ఆ డ్రగ్స్ తీసుకెళ్ళటానికి వీల్లేదని సహోద్యోగి గొడవ పడతాడు. వినకపోవడంతో అతనికి తెలియకుండా, ఆ సహోద్యోగి మరో పోలీస్(Julien Boisselier) తో డీల్ మాట్లాడుకొని ఆ డ్రగ్స్ చేజిక్కిన్చుకొమ్మంటాడు. ఆ మరో పోలీస్, ఇంకో నిజాయితీ పరురాలైన ఆడ పోలీస్(Lizzie Brocheré) తో ఆ నైట్ క్లబ్ లో ప్రవేశిస్తాడు.  కొడుకు కోసం అతను డ్రగ్స్ తీసుకేల్లినప్పటికీ, ఆ నైట్ క్లబ్ లో అవి దాచుంచిన ప్రదేశం నుంచి ఆడ పోలీస్ తో మాయం చేయిస్తాడు మరో పోలీస్. ఆ డ్రగ్స్ అనుకున్న సమయానికి డెలివరీ చేయకపోతే ఆ డ్రగ్ డీలర్ ని చంపేస్తానని కూర్చుంటాడు ఒకడు(Joey Starr). కొడుకు ఫోన్ ఎత్తట్లేదు, ఎక్కడున్నాడు అంటూ తన గర్భిణి భార్య(Catalina Denis) నుంచి మాటి మాటికి ఫోన్ వస్తుంటే అతనేం చెప్పాడు? చివరికి ఆ డ్రగ్స్ ఏమయ్యాయి? గాయంతో భాదపడుతున్న అతను తన కొడుకుని విడిపించుకు వెళ్ళడా? లేదా? ఆ రాత్రంతా ఆ నైట్ క్లబ్ లో ఏం జరిగింది? అనేది మిగితా కథ.

కథనం: ఈ సినిమాకి కథనం కీలకంగా మారింది. ప్రతి క్షణం ఉత్కంట రేపుతూ, ప్రేక్షకులని కదలకుండా కట్టిపడేస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో అత్యుత్తమ స్క్రీన్ ప్లే కనబరచిన చిత్రంగా చెప్పుకోవచ్చు. నూతన దర్శకులు, కథకులు స్క్రీన్ ప్లే పరిశోధన కోసం ఈ సినిమాని రిఫరెన్స్ గా తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. Thelma & Louise (1991) సినిమా తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో స్క్రీన్ ప్లే అద్భుతంగా కుదిరిన సినిమా ఈ Sleepless Night.

దర్శకత్వం: ఈ సినిమా ప్రేక్షకులకి బాగా నచ్చడానికి దర్శకత్వం కూడా ముఖ్యమైన కారణం. ఈ సినిమాకి దర్శకులు Frédéric Jardin సహా రచయిత కూడా! పోస్టర్ మీద He took their Drugs. They took his son. అని పెట్టి ఒక్క ముక్కలో కథని చెప్పేశారు. నైట్ క్లబ్ లో ఉన్న వందలాదిమంది మద్యం మత్తులో తమని తాము మరియు ఈ లోకాన్ని మరిచిపోయి ఆనందిస్తుంటే, ఒక్కడు మాత్రం శారీరకంగా & మానసికకంగా బాధపడే సన్నివేశాన్ని అద్భుతంగా చూపించారు.

ఛాయాగ్రహణం: ఈ సినిమాలోని ఛాయాగ్రహణం స్క్రీన్ ప్లే కి అనుగుణంగా కొత్త పంథాలో సాగుతూ ఆ ఫీల్ ను పోకుండా కాపాడుతూ సాగింది. ఈ సినిమా మొత్తం కెమెరాను చేత్తో పట్టుకొని మాత్రమే షూట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను – అంటే ఎటువంటి క్రేన్స్ లాంటి భారి పరికరాల్ని ఉపయోగించకుండా, తక్కువ బడ్జెట్ లో సినిమాటోగ్రఫి పూర్తి చేశారని నా భావన.

నటీనటులు: ప్రధాన పాత్రదారైన Tomer Sisley నటన సహజంగా ఉండి, ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా ప్రోత్సహిస్తుంది. మిగితా నటీనటులంతా బాగా నటించి రక్తి కట్టారు.

Nicolas Errèra అందించిన నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కొన్ని చోట్ల నిశ్శబ్దమే సంగీతంలా చేసుకోవడం, అవసరమైనప్పుడు మాత్రమే సంగీతాన్ని వాడటం వలన సినిమా నిజంగా జరుగుతన్న భావన మనలో మేదిలేలా చేశారు.  కూర్పు, పోరాటాలు కూడా అద్భుతంగా కుదిరాయి.

అయితే ఈ సినిమా నిడివి కేవలం 90 నిమిషాలు. ఇదే సినిమా ఇప్పడు తెలుగులో చీకటి రాజ్యం (2015) పేరుతో కమల్ హసన్ రీమేక్ చేశారు. అయితే చీకటి రాజ్యం మాత్రం నిడివి 127 నిముషాలు. మిగితా 37 నిముషాలు ఏముంది అనేది చీకటి రాజ్యం సినిమా చూస్తే కాని తెలీదు. నవంబర్ 10 న విడుదల కావాల్సిన చీకటి రాజ్యం, అనివార్య కారణాల వలన నవంబర్ 20కి వాయిదా పడింది. తమిళ వర్షన్ Thoongaa Vanam మాత్రం నవంబర్ 10 న విడుదలైంది. గతంలో A Wednesday సినిమాని సరిగ్గా రీమేక్ చేయకుండా అభాసు పాలయ్యాడు కమల్. ఈ సారి అది పునరావృతం కాకూడదని అతని అభిమానిగా కోరుకుంటున్నాను.


Sleepless Night(French: Nuit Blanche) ట్రైలర్ ని ఇక్కడ చూడొచ్చు:

చీకటి రాజ్యం ట్రైలర్ ని ఇక్కడ చూడొచ్చు:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి