ఇప్పుడే ‘ఊపిరి’(2016) మాతృక అయిన ‘ది ఇన్
టచబుల్స్’(2011) సినిమా చూశాను.. ఇది చాలా సెన్సిబుల్ సబ్జెక్టు.. పెన్ను టేబుల్
పై నుండి ఇచ్చినా, దాన్ని సహాయంగా గుర్తించి థాంక్స్ చెప్పుకొనే పాశ్చాత్య
దేశాల్లో, అచేతనంగా పడి ఉన్న ఒక వ్యక్తికి, మరో వ్యక్తి
అన్ని ‘రకాల’ సపర్యలు చేయడం అనేది చాలా గొప్పగా అనిపించే అంశం. అయితే భారతీయులకు
ఇవన్నీ మామూలు విషయాలు. మన ఇంట్లోనో, మన చుట్టాల ఇళ్ళల్లోనే ఎవరో ఒకరు ఇలా ఉండటం,
కుటుంబ సభ్యులు అన్ని సపర్యలు చేయడం చాలా మామూలు విషయం. ఇక్కడ నా ఉద్దేశ్యం,
బాధ్యతని త్యాగంగా భావించే మనస్తత్వం భారతీయ హృదయానికి లేదు. పైగా మానవత్వం
పుష్కలంగా ఉండే భారతీయ మనసులకు, అలాంటి గొప్ప విషయాలు కూడా మామూలుగా కనిపిస్తాయి.
ముఖ్యంగా నేను చెప్పచ్చేదేంటంటే ఇంత సెన్సిబుల్ సబ్జెక్ట్ మనకు అంతలా కనెక్ట్ కాడెమో
అని.. అందుకు మరో కారణం సినిమా మొత్తం కామెడి కోణంలో అంటే, హీరో (FrançoisCluzet/AkkineniNagarjuna)
కన్నా, అతనికి సహాయం చేసే వ్యక్తి (OmarSy/Karthi)
కోణంలోనే ఎక్కువగా సాగుతుంది. హీరో పడుతున్న బాధని అసలు చూపించరు అనే చెప్పాలి,
హీరోని అతని సహాయకుడు ఎలా చూస్తున్నాడు అన్నదే ప్రధాన ఉద్దేశ్యం. ఇంకో రకంగా
చెప్పాలంటే మున్నాభాయ్ ఏం.బి.బి.ఎస్ (హిందీ) సినిమాలో సంజయ్ దత్ మరియు వీల్ చైర్
కి పరిమితమయ్యే పేషెంట్ ల కథని విస్తరిస్తే ఇంచుమించు ఇలానే ఉంటుందేమో. OmarSy వేసిన
పాత్రకి Karthi ఇంచుమించుగా సరిపోతాడు. FrançoisCluzet పాత్రకి
AkkineniNagarjuna ఏ మేరకు సరిపోతాడో చూడాలి. FrançoisCluzet నవ్వు
అద్భుతంగా ఉంది, అతని పాత్రని ఆ నవ్వొక్కటే నడిపిస్తుంది. OmarSy కూడా అద్భుతంగా
నటించాడు. దర్శకత్వం, ఫోటిగ్రఫీ, నటన ఈ సినిమాని నిలబెట్టాయి.
అక్కడి నిజ జీవిత కథ కావడం కూడా కలిసి వచ్చిన అంశం. నా ఉద్దేశ్యం మన బొంబాయి, ప్రేమిస్తే సినిమాలతో మనం
కనెక్ట్ అయినంతగా, పరయిదేశం
వాడు ఎలా అయితే కాలేడో, మనమూ
పరాయి దేశపు నిజ జీవిత కథని, కేవలం కథలనే స్వీకరించే అవకాశం
లేకపోలేదూ అని.
తమన్నా/ AudreyFleurot పాత్ర నిడివి మాతృకలో చాలా తక్కువ. పైగా OmarSy, AudreyFleurot వెంట సరదాగానే పడతాడు తప్ప అందులో సిన్సియరిటి, సీరియస్ నెస్ కనిపించవు. తెలుగు సినిమా కాబట్టి కార్తి తమన్నాని నిజంగా ప్రేమించే అవకాశం ఉంది, పాటలు కోసమైనా తప్పదు కదా.
FrançoisCluzet/AkkineniNagarjuna పాత్ర ఒక అమ్మాయితో కలం స్నేహం చేస్తుంది. ఆమెని కలుసుకోవడమే అతని లక్ష్యం అని చెప్పొచ్చు. ట్రైలర్ లో నాగార్జున ఆ పాత్రతో కార్లో షికారు కెల్లడం, బయట తిరగటం లాంటివి చూపించారు. సో కథ పెరిగిందేమో ?! పోరాటాల కోసం ఒక చేసింగ్ సీన్ పెట్టినట్టు కనిపిస్తోంది, అందులోనూ ఉంటుంది కాని దాని ఉద్దేశ్యం వేరు. ట్రైలర్ మధ్యలో & చివర్లో నాగార్జునని, కార్తి బైక్ పై వెనకాల కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిన సీన్ కనిపించింది. నిజానికి François Cluzet/Akkineni Nagarjuna పాత్ర వీల్ చైర్ లో బెల్ట్ పెడితే తప్ప అలాగే ఒరిగి ఉండలేని పరిస్థితి. ఆ సీన్ అలా ఎందుకు పెట్టారో చూడాలి మరి..!!
రేపు విడుదల అవుతున్న ఊపిరి సినిమా విజయం సాధించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
All the Best to the Oopiri Team..!!
The Intouchables సినిమా ట్రైలర్ ఇక్కడ చూడండి:
ఊపిరి సినిమా ట్రైలర్ ఇక్కడ చూడండి:
Good Analysis :)
రిప్లయితొలగించండి