ఊళ్ళో
బావి ఇంకిపోయింది..
ఇంట్లో
కన్నీళ్ళు ఊరుతున్నాయి..!
2)
మనసు బావిలోని
ఆప్యాయత ఊటని
డబ్బు పంపు
వేగంగా తోడేస్తోంది..!
3)
హలో
నమస్కారమే ఐతే..
తెలుగుకి
పురస్కారమే..!
4)
అమ్మానాన్నకు లేని
అదృష్టం..
ఆయమ్మకు
సొంతం!
5)
బాల్యం ఎదురైంది
సందు చివరలో..
యవ్వనం నిలబెట్టింది
చౌరస్తాలో!
6)
వెన్నెల్లో ఆడపిల్లని
చదివానే..
వెన్నెలంటి నిన్ను
చదివేస్తూ ఉన్నానే!
7)
లంగోటాల్లో నిండుకుంటున్న
బాల్యం..
కబ్జా అయిపోతున్న
కొత్తదండెం!
8)
ఆడ మగ సమానమని
నేర్పి ఉంటే..
నిర్భయ దిశలు
ఆగేవేమో!
9)
కలుసుకో మనసుని
తొలిరేయిన..
కలుపుకో తనని
ఏరాతిరైనా!
10)
చెడ్డీదోస్తు కలిశాడు
ఎర్రబస్సులో..
ముచ్చట్లను ఆపాము
రాజధానిలో!
-
ప్రతిలిపి వెబ్సైట్ చూసినప్పుడు నానీల పోటీ కనిపించింది. చూస్తే ఆ రోజే చివరి రోజు. ప్రచురితమైన నానీలను కూడా వాళ్ళు అనుమతిస్తుండంటంతో, ఇది వరకే చతురలో ప్రచురితమయిన 4 నానీలను కలుపుకుని ఎన్ని వీలైతే అన్ని రాద్దాం అని రెండు మూడు గంటల్లో ఇంకో ఆరు రాసి, మొత్తం కలిపి పది నానీలు పోస్ట్ చేశాను. (ఇందులోని మొదటి నాలుగు నానీలు 2010లో చతురలో కొత్తగాలి శీర్షికన వచ్చాయి.) ప్రతిలిపిలో నా రచనలు ఏవీ లేని కారణంగా, నానీలనైనా ఉంచుదాం అని అనుకోవడం కూడా ఒక కారణం.
ఇవే నానీలు ప్రతిలిపిలో ఉండే చోటు:
https://telugu.pratilipi.com/story/TpR2nyOjL8xX
(పైన లింక్ క్లిక్/టచ్ చేశాక, "చదవండి" అన్న దగ్గర క్లిక్ చేయండి .. ఆ తర్వాత "తదుపరి అధ్యాయం" క్లిక్ చేస్తే, తరువాతి నానీ కనిపిస్తుంది.)
నానీలు రాసినారీ ఆలూరి
రిప్లయితొలగించండిబ్లాగులు చూసినారీ తెలుగోడి
ఆశలు తీరాలి మరిమరి
చైతన్యాలు కావాలి ఝరి......
.....ధన్యవాదాలు...మీ తెలుగోడు.
ధన్యవాదాలు చైతన్య గారు.. నానీ తరహాలోనే స్పందించడం చాలా నచ్చింది 🙏💐
తొలగించండి“నానీ” అంటే ఏమిటి, అరుణ్ కుమార్ గారు?
రిప్లయితొలగించండినరసింహా రావు గారు.. ఆచార్య ఎన్. గోపి గారు ప్రవేశపెట్టిన ఈ నానీ ప్రక్రియ ఒక సూక్ష్మ కవిత పద్ధతి.
తొలగించండినాలుగు లైన్లలో, 20 నుండి 25 అక్షరాల మధ్యలో సాగాలి అని నియమం.
తొలగించండితెలియక పోతే
నేర్చేసుకుంటారు.
నరసింహానికి
తెలియనిది లేదు