తెలుగులో తొలి డైనమిక్ వెబ్ పత్రిక "సంచిక" గురించి 2018లో తెలిసింది, మిత్రుడు రాసిన కథ అందులో వచ్చిందని చెప్పడం ద్వారా! ఆ కథ చదివాక, "సంచిక" నిజంగానే డైనమిక్ అనిపించింది, ఎందుకంటే భయానక (హార్రర్) జానర్ లో సాగే ఆ కథని అప్పటికి (నాకు తెలిసి ఇప్పటికీ) ఏ తెలుగు పత్రిక, వెబ్ పత్రిక ప్రింట్ చేసే ధైర్యం చేయలేవు.
ఆ తర్వాత తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వచ్చిన "ముచ్చట@కథ, స్క్రీన్ ప్లే" వర్క్ షాప్ లో కస్తూరి మురళీ కృష్ణ గారు 'హిందీ సినిమాల గురించి' మాట్లాడిన సెషన్ విన్నాను. సినిమా మరియు సాహిత్యం పట్ల వారికున్న పట్టు అమోఘం.
ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నానంటే, కస్తూరి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం వెలువడుతున్న "సంచిక" మ్యాగజైన్ లో "ఇది నా కలం" పేరుతో సరికొత్త శీర్షిక ప్రారంభించారు. ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. తోడి రచయిత మిత్రులు ఒకరు (వారికి ఇష్టం లేదు కాబట్టి పేరు ప్రస్తావించడం లేదు, తప్పుగా అనుకోవద్దు) నా వివరాలు అడిగితే, పంపించాను. అయితే ఈ శీర్షికలో ఫస్ట్ నా గురించే వేస్తారు అని ఊహించలేదు, ఇలా రావటం నా అదృష్టం.
కథలు, నానీల్లో నాపేరు పత్రికల్లో రావటమే కానీ ఇలా నా గురించి పరిచయం మాత్రం ఎక్కడా రాలేదు, ఇదే ప్రథమం! చాలా సంతోషంగా, హాయిగా ఉంది. మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు, మన ప్రమేయం లేకుండా మనం గుర్తింపబడడం సంతృప్తినిచ్చే అంశమే కదా!
నా ఫేస్ బుక్ స్నేహితుల్లో సగం మంది ఆర్కుట్ నుంచి ఉన్నవాళ్లు ఉన్నారు. వారికి కొంత నా గురించి తెలుసు, ఇక్కడే fbలో పరిచయమైన వారికి, ముఖ్యంగా ఈ మధ్యే పరిచయమైన వారికి నా గురించి తెలిసే అవకాశం తక్కువ కాబట్టి, ఈ శీర్షిక ద్వారా నన్ను తెలుసుకుంటారు అని ఆశిస్తున్నాను.
లింక్: https://sanchika.com/idi-naa-kalam-1/
నోట్: మొన్న జులై 1న వెలువడిన తెలుగు తల్లి కెనడా కథల పోటీల ఫలితాల కన్నా ముందే నా వివరాలు పంపి ఉండటం వల్ల, "చిన్ని మనసులు" కథ గురించిన ప్రస్థావన, అది బహుమతి గెలుచుకున్న విషయం ఇందులో ఉండదు అని గమనించగలరు.
ఇలా నా పరిచయం రావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన అందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు!
థాంక్యూ ఆల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి