కెనడా డే సందర్భంగా కథల పోటీ అని తపన గ్రూప్ లో చూడగానే, "అదేంటబ్బా?" అని గూగుల్ ని అడిగితే, వికీపీడియాకి పొమ్మంది. "ఆ మాత్రం మాకు తెలియదా, దాని సెర్చ్ సరిగ్గా ఉండకే కదా నీ దగ్గరికొచ్చింది" అని సర్ది చెప్పి అటునుంచి వికీకి పోయా. జులై 1న కెనడా డే జరుపుకుంటారట, ఆ రోజు వాళ్లకి జాతీయ దినం, అంటే మన భాషలో హాలీడే అన్నమాట! అది చాలు కదా మనకి ఆరోజు గొప్పతనం తెలుసుకోవడానికి! మొత్తానికి ఆరోజు సందర్భంగా కెనడాలో ఉండే తెలుగు వాళ్లు, ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు వాళ్ల కోసం కథల కవితల పోటీ పెట్టటం పుణ్యం పురుషార్థం తరహాలో బాగా నచ్చింది.
ఇదే విషయాన్ని మా బుజ్జి రచయితల/త్రులతో డిస్కస్ చేస్తే, వాళ్ళు అదే అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో ఇక నుంచి కథలు
రాసి పెట్టుకొని, ఆ కథకి సూట్ అయ్యే పోటీ వస్తే దానికి పంపించడం, లేదా సాధారణ ప్రచురణకు పత్రికలకు లేదా ఆన్లైన్
మ్యాగజైన్లకు పంపించాలని గట్టిగా తీర్మానించుకున్నాం. మన భాషలో చెప్పాలంటే చైనీస్ కరోనా ప్రైడ్ రైస్ కన్నా, హైదరాబాదీ కోవాక్సిన్ బిర్యానీనే ఉత్తమోత్తమని నిర్ణయించుకున్నాం అన్నమాట.
ఆ నిర్ణయం తర్వాత వచ్చిన కథల పోటీనే ఇది. దాంతో నా దగ్గర ఇది వరకే రాసి పెట్టుకున్న "చిన్ని మనసులు" కథని దీనికి పంపగా, బహుమతి లభించడం, నా సంతోషానికి సంతృప్తికీ కారణమై ఇంత పెద్ద పోస్టు రాయటానికి తద్వారా మీ సహనానికి పరీక్ష
పెట్టడానికి పురిగొల్పింది. మొత్తం 120 కథలు వస్తే, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని కాకుండా, అన్ని కథల్ని సమానంగా చూసి 30 కథల్ని బహుమతికి ఎన్నుకొని, అందరికీ సమానంగా $21 CAD అనగా కెనడియన్ డాలర్లు ప్రకటించడం కూడా బాగా నచ్చింది. అలాగే 117 కవితల్లోంచి 25 కవితల్ని సెలక్ట్ చేశారు. ఆ ఫలితాలు తెలుగుతల్లి కెనడా పత్రిక వెబ్ సైట్ http://telugutalli.ca/ లో చూడొచ్చు.
అలాగే విశాలాక్షి మాస పత్రిక ఏటా నిర్వహించే కథల పోటీలో గెలుపొందిన బహుమతి కథలతో ప్రత్యేకంగా ఒక పుస్తకం అచ్చువేయించి బహిరంగ విపణిలో అందుబాటులో ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి పోటీలో ఆదర్శవివాహాల నేపథ్యంలో రాసిన నా కథ "సుబ్బయ్యతాత పెళ్లి" బహుమతిని గెలుచుకున్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
"చిన్ని మనసులు" కథ తెలుగుతల్లి కెనడా పత్రికలో వచ్చినప్పుడు, "సుబ్బయ్యతాత పెళ్లి" కథతో విశాలాక్షి వాళ్ళు వెలువరించే సంపుటిలో వచ్చినప్పుడు తెలియజేస్తాను.
అందరికీ ధన్యవాదాలు..!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి