83 - సినిమా సమీక్ష

Superb Direction... Extraordinary Screenplay... Available on Netflix in Hindi and Telugu.           Cinematic liberty పేరుతో సంఘటనల వక్రీకరణ పెద్దగా లేదని, పాత్రలకు అనవసర దైవత్వాన్ని ఆపాదించలేదని నాకనిపించింది. Melodrama పేరుతో అక్కరలేని సన్నివేశాలు కానీ, మాటలు కానీ లేవు. తప్పకుండా చూడాల్సిన సినిమా అంటాను! రచయితలు ఈ సినిమాని మిస్ అవ్వొద్దు, స్క్రీన్‌ప్లేలో కొత్త పాఠాలు నేర్చుకోవచ్చు! Creativityని ఇంతందంగా ఇరికించొచ్చని, వాస్తవ సంఘటనలను ఇన్ని కోణాల్లో engagingగా చూపించొచ్చని... ఇంకా చాలా చాలా విషయాలు అర్థమయ్యాయి. Loved It 😍  

 

దర్శకుడు Kabir Khan, రచయితలు Kabir Khan, Sanjay Puran Singh Chauhan, Vasan Bala, Sumit Arora లను మెచ్చుకోకుండా ఉండలేం! Kudos to the team 83 ❤️💐  

 

ఇందులో అన్ని విభాగాల పనితీరు అద్భుతంగా ఉంది. అందరు నటులు బాగా చేశారు. Ranveer Singhలో‌ కపిల్ దేవే కనిపిస్తాడు. Krishnamachari Srikkanth పాత్రలో Jiiva కనిపించడం, అతనికి తెలుగు డబ్బింగ్ Rahul Ravindran చెప్పడం గొప్ప ఊరట! Deepika Padukone తనలాగే కనిపించింది. ఆమె వల్ల సినిమాకు అదనంగా వచ్చిన లాభం గానీ, ఆమె లేకపోవడం వల్ల వచ్చే నష్టం కానీ ఏముందో నాకైతే అర్థం కాలేదు.  

 

హ్యూమర్ కోసం జట్టు సభ్యుల మీద కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, వాటిలో Yashpal Sharma & Krishnamachari Srikkanth పాత్రల మీద ఉన్నవి కొద్దిగా మింగుడుపడదు. నిజ జీవితంలో ఆ పాత్రలు అలాగే ఉన్నాయా అని అనుమానం వస్తుంది. అలా ఉన్నప్పటికీ వారినలా చూపెట్టడం వారిని, వారి  అభిమానుల్ని హర్ట్ చేయడం అవుతుందేమో అనిపించింది. 83 world cup గురించి ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు, నేను విన్నంతలో Sunil Gavaskar గురించి అందరూ ఒకే రకంగా అనుకున్నారు. ఇందులో కూడా సాధారణ జనం అనుకున్నట్టుగానే ఆ పాత్ర కనిపిస్తుంది తప్ప, అలా జరగడానికి గల కారణాలు గాని, అది కనిపెట్టడానికి చేయాల్సిన లోతైన పరిశోధన కానీ కనిపించదు. 

 

ఒక రకంగా ఆలోచిస్తే బయోగ్రఫీలన్నీ వన్ సైడెడే. సెలబ్రిటీలు రాసుకున్నది లేదా దాని ఆధారంగా తీసింది వారి కోణం మాత్రమే! వారికి నచ్చిన వ్యక్తులను గొప్పగా, నచ్చని వారిని హీనంగా చూపించవచ్చు. ఇతర నిజజీవిత పాత్రల దగ్గరికి వెళ్ళి, అసలేం జరిగిందని ఎవరూ అడగరు! వారి కోణం ఎవరికీ పట్టదు. అది తప్పైనా ఒప్పైనా నిజం మాత్రం మరుగునపడిపోతుంది. 

 

 ఈ సినిమా చూస్తుంటే చాలా సార్లు M.S.Dhoni సినిమా గుర్తొచ్చింది.  ఆ సినిమా చూస్తున్నంతసేపు ధోనీ నాకు అభినవ గాంధీలా కనిపించాడు. అంత స్ట్రిక్ట్‌గా ఉన్నాడు కాబట్టే ఆ స్థాయికి వెళ్లుంటాడు అని నమ్మాను. నా fb పోస్ట్‌లో కూడా అదే రాశాను. ఆ తర్వాతెప్పటికో అతనికి అన్న ఉన్న విషయం అసలు సినిమాలో ప్రస్తావన కూడా లేదని తెలిసి అతని మీద జాలేసింది. సచిన్ మీద వచ్చిన సినిమా నేను చూడలేదు. అయితే అతన్ని చట్టసభలకు ఎన్నుకోవడం, వాటికతను గైర్హాజరు కావడం, కానీ తన సినిమా కోసం అందర్నీ ఇన్వైట్ చేయటం మీద విమర్శలు, మీమ్స్ గుర్తొచ్చాయి.  

 

ఈ సినిమా చూస్తున్నంత సేపు కపిల్ స్వభావం ఇదే అయితే కనుక, అతన్ని ఆరధించకుండా ఉండలేం అనిపించింది. సినిమా కోసం అతని పాత్ర స్వభావాన్ని మార్చి పెట్టడానికి కూడా ఏమీ కనిపించలేదు. మహా అయితే సినిమాలో చూపించినంత కూల్ గా ఉండకుండా టీమ్ మెంబెర్స్ మీద కోప్పడి ఉండొచ్చు. కానీ ధోనీ అయినా, కపిల్ అయినా దగ్గర నుంచి చూసే ఛాన్స్ మనకు లేదు, సినిమాల్లో చూపించింది నమ్మటం మినహా!  

 

అయితే ఒక్కటి మాత్రం అనిపించింది, కపిల్ తలుచుకుంటే అతని బయోగ్రఫీ వచ్చేది, అది కూడా సచిన్, ధోనీ కన్నా ముందు వచ్చేది. అతను తలుచుకోలేదు. అందుకు కారణాలు అనేకం ఉంటాయి, అయితే వాటన్నిటి వెనకాల అతని స్వభావం, మనస్తత్వం వాటిలో మిళితమై ఉంటాయి. ఇప్పుడు కూడా వచ్చింది అతని బయోగ్రఫీ కాదు, వరల్డ్ కప్ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఏం జరిగిందని మాత్రమే!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి